16-09-2025 11:38:34 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తామన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రంమలో కూనంనేని మాట్లాడారు. పోరాటాలు చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపామని, ఇప్పుడు మీ అందరి అభిమానంతో ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యాయని చెప్పారు. ఈ ప్రాంత సమస్యల కోసం, ప్రజల ప్రయోజనాలు, మేలు కోసం అనునిత్యం తపిస్తున్నామని, అసెంబ్లీలోసైతం ప్రజా సమస్యలను పెద్ద ఎత్తున లేవనెత్తి ప్రాంతాలకు అతీతంగా మాట్లాడుతున్నట్లు చెప్పారు.
కొత్తగూడెం నియోజక వర్గాభివృద్ధికి అనునిత్యం తపిస్తున్నామని, అసెంబ్లీలోసైతం ప్రజా నమస్యలను పెద్ద ఎత్తున లేవనెత్తి ప్రాంతాలకు అతీతంగా మాట్లాడుతున్నట్లు చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గాభివృద్ధికి ప్రభుత్వంతో పలు మార్లు చర్చించి వీలైనన్ని నిధులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే కొత్తగూడెం నియోజకవర్గాన్ని అందర్శంగా నిలపాలనే తపనతో పలు రకాల గ్రాంట్లు ద్వారా నిధులు రాబట్టి మౌళిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతీ ఒక్కరికీ వథకాలు అందుదాయని, రాబోయేరోజుల్లో ప్రతీ ఒక్కరికీ మేవు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా 617 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, మున్నుందు విడతల వారీగా మిగిలిన వారికి కూడా అందిస్తామని చెప్పారు.
ఇందులో ఎలాంటి రాగద్వేషాలు లేవని, రాజకీయాలకు అతీతంగా నిజమైన అర్హులను గుర్తించిన తర్వాతే పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజాప్రతినిధిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాని, నేను మీ ఇంట్లో ఒకనిగా ఉన్నానని, మీకు కష్టం వస్తే, ఆ కష్టం నాకు కూడా వచ్చినట్లే అని తెలిపారు. ఇక్కడికి వచ్చిన తల్లులంతా మీ పిల్లలను బాగా చదివించాలని, కష్టపడి పిల్లలకు చదువులు చెప్పిస్తే భవిష్యత్లో వారు ఉన్న స్థానాలకు చేరుకుంటారని, చదువే మీరు పిల్లలకు ఇచ్చే విలువైన సంపద అని అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36 వార్డులు, పాల్వంచ మున్సిపాలిటీలకు చెందిన 24 వార్డులకు చెందిన 617 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.