calender_icon.png 17 September, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు భావితరాలకు స్ఫూర్తిగా ఎదగాలి

17-09-2025 01:35:22 AM

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి 

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి)విద్యార్థులు రేపటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం నెలిలికొండ చౌరస్తాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొని విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు.

అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఇందిరా మహిళా శక్తి, మత్స్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నీలి విప్లవ పథకం కింద జిల్లా మత్స్యశాఖ అధికారి రజిని ఆధ్వర్యంలో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ చేశారు.

అనంతరం మండలంలోని శ్రీపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులుఉన్నారు.