17-09-2025 01:32:36 AM
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి కర్కశత్వం
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 16 ( విజయక్రాంతి ) తన వివాహేతర సంబంధానికి కన్న కొడుకు అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో అభం శుభం తెలియని పదేళ్ల పసిపిల్లాడి వీపుపై కన్నతల్లి కర్రు కాల్చి వాతలు పెడుతూ హింసిస్తోంది. గదిలో బంధించి చిత్రహింసలను తాళలేక గోడదూకి పా రిపోయిన బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేస్తుంది.
నాగర్ కర్నూల్ జిల్లా ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఆ దంపతులు ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య తన పదేళ్ల కుమారుడు(10)తో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటుంది. భర్తకు దూరంగా ఉంటూ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తన కుమారుడు అందుకు అడ్డుగా ఉన్నాడని భావిస్తూ తరచూ దాడికి తెగ పడుతోంది.
తాజాగా కర్రు కాల్చి వీపుపై వార్తలు పెట్టి గదిలో బంధించింది. బందీ నుంచి తప్పించుకొని గోడ దూకి నాగర్ కర్నూల్ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. అంతకుముందు విషపు గుళికలను బలవంతంగా మింగించిందని బాలుడు బోరుణ విలపించాడు. దీనిపై ఎస్‌ఐ గోవర్ధన్ వివరణ కోరగా తన దృష్టికి రాలేదని విచారించి బాలుడికి న్యాయం చేస్తాననితెలిపారు.