17-09-2025 01:30:31 AM
వనపర్తి, సెప్టెంబర్ 16 ( విజయక్రాంతి ): వనపర్తి పోలీసులు అత్యుత్సాహం విడనాడాలని తెలంగాణ మె డికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ లో ఎలాంటి ఆందోళన కార్యక్రమం పిలుపు లేనప్పటికీ మంగళవారం ఉదయం వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి విధుల్లో
ఉన్న ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూ నియన్ బ్రాంచ్ నేతలను, కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం సబబు కాదన్నారు. అనాలోచితంగా అవివేకంగా,కార్మికులను అరెస్టు చేసిన పోలీస్ లపై చర్యలుతీసుకోవాలి.