calender_icon.png 16 October, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

16-10-2025 05:21:09 PM

అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలల యాజమాన్యాలు చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు అన్నారు. జిల్లాలో బెస్ట్ అవైలబల్ స్కీంలో SC, ST విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్న పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆదిలాబాద్ లోని సి.రాంరెడ్డి, కృష్ణవేణి, ప్రగతి పాఠశాల్లో చదువుతున్న SC, ST  విద్యార్థులతో మాట్లాడి, విద్యార్థుల హాజరు, వారికి అందిస్తున్న సౌకర్యాలాగురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి సునీత, ఎంఇఓ సోమయ్య, ASWO నారాయణరెడ్డి, పాఠశాల యాజమాన్యం ఆదినాథ్, వెదవ్యాస్, పెంటన్న ఉన్నారు.