29-08-2025 03:10:11 AM
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని ఏకాగ్రత తో లక్ష్య సాధనకు కృషి చేయాలి
సోషల్ మీడియాకు పరిమితంగా చూడాలి
మిషన్ వాత్సల్య పీఎం కేర్స్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పోస్టాఫీస్ డిపాజిట్ పుస్తకాలు అందించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఆగస్టు 28 (విజయ క్రాంతి): ఎ క్కడ ఉన్న, ఏం చదివిన కష్టపడే తత్వం ఉన్నప్పుడే అనుకున్నది సాధిస్తామని జిల్లా కలె క్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మిషన్ వా త్సల్య కార్యక్రమంలో భాగంగా పీఎం కేర్స్ పథకం క్రింద పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, పిల్లలకు మార్గదర్శనం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్ క్రింద 10 లక్షల రూపాయల పోస్టల్ డి పాజిట్, వారి చదువు, కెరీర్ పరంగా స్థిర ప డే విధంగా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో కో విడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి న 13 మంది పిల్లలను గుర్తించినట్లు, వారి పేర 10 లక్షల పోస్టల్ డిపాజిట్ చేసినట్లు, ఇ ట్టి మొత్తం వారికి 23 సంవత్సరాల వయ స్సు నిండగానే డ్రా చేసుకొనుటకు అవకాశం కల్పించినట్లు అన్నారు.
ఇట్టి డబ్బును వృధా చేయక ఉపాధికల్పనకు, అభివృద్ధి కి సద్వినియోగం చేసుకోవాలన్నారు. విభిన్న కుటుంబ నేపధ్యం, వివిధ స్థాయిలో ఉన్న, ఎక్కడ ఉన్న, ఏం చదివిన కష్టపడే తత్వం ఉ న్నప్పుడే మంచి ఫలితం ఉంటుందని అన్నా రు. కష్టం ఎప్పుడు వృధా కాదని, సులభం గా వచ్చింది ఏదైనా ఎక్కువ రోజులు నిలవదని అన్నారు. కాలం ఎంతో విలువైనదని, పోయిన కాలం ఎన్నటికీ తిరిగి రాదని అన్నా రు. జీవితంలో ఇది సాధించాలన్న కష్టపడాలని అనుకున్న లక్ష్యసాధనపై దృష్టి కేంద్రీక రించాలని తెలిపారు.
జీవితంలో అప్ అండ్ డౌన్స్ సహజమని, ఒకే రోజు అన్ని మన దగ్గరకు రావని అన్నారు. తాను 3 సార్లు సివిల్స్ పరీక్షలు రాసిన ఫలితం రాలేదని, నిరుత్సా హం చెందక, ఎక్కడ పొరపాట్లు చేసాను అ ని దీక్షతో పొరపాట్లు సరిదిద్దుకొని ఐఏఎస్ అయ్యానని కలెక్టర్ అన్నారు. అకుంఠిత దీక్ష తో కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించానని అ న్నారు. పరాజయం నుండి, నిరంతర ప్రయ త్నం తో విజయం వైపు సాగాలన్నారు. సో షల్ మీడియా నియంత్రణ తో ఉపయోగించాలని, సోషల్ మీడియా తో సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు.
సోషల్ మీడి యా బదులు ఆటలు ఆడితే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ఇం టర్ నెట్ ను మంచి విషయాలు నేర్చుకోవడానికి వాదాలన్నారు. చదువును మించింది లేదని, కష్టపడి చదివితే ఉన్నత స్థానం చేరుకోవచ్చని కలెక్టర్ అన్నారు. కాలం చాలా విలువైనదని, పోతే తిరిగి రాదని, ఇప్పుడు కాలాన్ని వృధా చేసి, తర్వాత బాధపడితే ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
కాలం రీత్యా పిల్లలు ఎంతో ధనవంతులని, సోమరితనం వీడి, క్రమశిక్షణ తో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాం గోపాల్ రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్ పర్సన్ భారతి రాణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి విష్ణు వందన, సంక్షేమ శా ఖ అధికారులు, పిల్లలు, పిల్లల సంరక్షకులు, తదితరులు పాల్గొన్నారు.