25-11-2025 12:00:00 AM
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతా
హనుమకొండ నవంబర్ 24 (విజయ క్రాంతి):నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని,రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.సోమవారం రోజున నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి 62 డివిజన్ సోమిడిలో సుమారు 1.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
గ్రామీణ వాతావరణంలో ఉన్న కాజీపేట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ప్రధాన సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని,జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు తమ సహకారాన్ని అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్,సయ్యద్ విజయశ్రీ రజాలి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.