calender_icon.png 25 November, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదలైన పంచాయితీ!

25-11-2025 12:00:00 AM

ఆ ఒడ్డున ఉంటావా..  ఈ ఒడ్డుకొస్తావా..

స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలలో మండలంలో గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించగానే గ్రామాలలో రాజకీయ వేడి ఒక్కసారిగా మొదలైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకటనతో బీసీ లు సంబరాలు చేసుకున్నారు. ఇది కాస్త పెం డింగ్లో పడడంతో, గతంలో మాదిరిగానే రిజర్వేషన్లను ప్రకటించడంతో బీసీ వర్గాలకు అ న్యాయం చేసినట్లు అయింది. మండలంలోని గ్రామాలకు ప్రకటించిన రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు ఎప్పుడు జరిగినా నాకే టిక్కెట్ రావాలని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మండలంలోని పంచాయతీ స్థానాలకు పోటీపడుతున్న ఆశావాహుల ఆశలు చిగురిస్తాయో లేదో ఈ ఎన్నికల్లో వేచి చూడాల్సిందే. ఇప్పుడు జరిగే పంచాయతీలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ముగ్గురు నుండి నలుగురు అభ్యర్థులు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.. ఆ ఒడ్డున ఉంటావా. ఈ ఒడ్డు కొస్తావా.. అనుకుంటూ.. ఈ పంచాయతీలలో చివరకు ఎవరికీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత వస్తుందో లేదో వేచి చూ డాల్సిందే.. గ్రామ పంచాయతీల కు జరిగే ఎన్నికలపై విజయ క్రాంతి ప్రత్యేక కథనం....       

ఎర్రుపాలెం నవంబర్ 24 ( విజయ క్రాంతి) :మండలంలో ఏ నలుగురు కూర్చు న్నా త్వరలో జరగబోయే పంచాయతీల ఎ న్నికల గురించే చర్చించుకుంటున్నారు. మం డలంలో రాజకీయ పొత్తులు, రాజకీయ స మీకరణాలు ఎట్లా ఉన్న, ఈ ఎన్నికల్లో టికెట్ రాకపోతే.. ఆ ఒడ్డున ఉంటావా... టికెట్ వస్తే ఈ ఒడ్డు కొస్తావా.. అనుకుంటూ .. ఈ పం చాయతీ ఎన్నికలపై గ్రామాల ప్రజలు మా ట్లాడుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది. దీనికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడంతో బీసీల సంబరాలు చేసుకున్నారు.

కా నీ ఇది కాస్త పెండింగ్లో పడడంతో గతంలో మాదిరిగానే రిజర్వేషన్లను ప్రకటించారు. దీనితో బీసీ వర్గాలకు అన్యాయం చేసినట్లు అయింది. మండలంలో పంచాయతీల స్థా నాలకు పోటీపడుతున్న ఆశావాహులు తమ అదృష్టం దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అధిష్టాన నేతల దగ్గరకు వెళ్లి తాము పోటీ చేసే పంచాయతీలలో తమకు అవకాశం కల్పించాలని తమ యొక్క బలాబలాలను, రాజకీయ బలాలను, రాజకీయ సమీకరణాలను, అధిష్టానం ముందు పెడుతున్నారు.

తాము ఎ ప్పటినుంచో ఈ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నామని, పార్టీ ఏది చెబితే ఆ పనిని చేసు కోపోతున్నామని కావున ఎన్నికల్లో తమకే అవకాశం కల్పించాలని ప్రధాన రాజకీయ పక్షాలను టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు వేడుకుంటున్నారు. అయితే కొంతమంది అభ్యర్థు లు మాత్రం ప్రకటించిన రిజర్వేషన్ ల తో తమ భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయిందని ఇప్పుడు ఏం చేయాలని అభ్య ర్థులు వాపోతున్నారు. పార్టీ ఎవరిని నిలబెడుతుందో ఎవరికి మద్దతు తెలపాలో, గెలిచి న తర్వాత తమకు ఎంతవరకు రాజకీయం గా ఉపయోగపడతారు అని లెక్కలు వేసుకుంటున్నారు. తాము ఊహించినదే జరిగితే తమకు రాజకీయంగా సమీకరణాలు ఎంతవరకు కలిసి వస్తాయో వేచి చూస్తూ ముం దడుగులు వేస్తున్నారు.

ప్రధాన రాజకీయ పార్టీలలో యువతకు అవకాశం కల్పించాలని ప్రధాన రాజకీయ నేతలను కలిసి యువత తమ భవిష్యత్తును అంచనా వేసుకుంటున్నారు. అయితే తాము సుదీర్ఘ కాలం పాటు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నామని, గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామని ప్రజలు మమ్మల్ని దీవిస్తారని సీనియర్ నేతలు కూడా అధిష్టానం నేతలను కలి సి తమ యొక్క బాధలను చెప్పుకుంటున్నా రు. అధిష్టానం మాత్రం యువత సీనియర్ నాయకుల అభ్యర్థులను వింటూ మీకు తగి న న్యాయం చేస్తామని, అధిష్టానం మాకు మాట ఇచ్చిందని పేర్కొంటున్నారు.

మండలంలో కొన్ని గ్రామాలలో జరిగే స్థానాలకు ఎక్కువమంది పోటీ పడుతుండడంతో అధిష్టాన నాయకులకు కూడా ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు.కొంతమంది నేతలు మాత్రం ఈ పంచాయితీ ఎన్నికలు మాకు కలిసి రాకపోతే వచ్చే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో మాకు న్యాయం జరగొచ్చు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ ఎన్నికల్లో యువత, సీనియర్ నాయకులు, విద్యావేత్త లు, మహిళలు కూడా తామేమి తక్కువ కాద ని తమకు పంచాయతీ ఎన్నికల్లో అవకాశా లు కల్పించాలని అధిష్టాన నాయకుల్ని కలిసి ప్రసన్నం చేసుకొని ఋవేడుకుంటున్నారు.

ఏమైనాప్పటికీ ఎవరికీ టిక్కెట్లు దక్కుతాయో ఎవరిని విజయం వరిస్తుందో ఎన్నికలు జరి గే వరకు వేచి చూడాల్సిందే. మండలంలో జరిగే ఈ పంచాయితీ ఎన్నికల్లో మండల రాజకీయ పార్టీలు తమ లెక్కలు తమకు ఉ న్నాయని గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా యి. ఈ పంచాయతీ ఎన్నికలపై మండల ప్ర జలు ఆసక్తిగా చూస్తున్నారు.