calender_icon.png 1 October, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే భూమి పూజ

01-10-2025 01:14:22 AM

ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ గోడం నగేష్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాం తి): అనాదిగా వస్తున్న దసరా ఉత్సవాలను ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హిందూ నమాజ్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని దసరా మైదానంలో చేపడు తూన్న  దసరా ఉత్సవాల ఏర్పాట్లకు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామితో కలిసి మం గళవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

అదేవిధంగా దసరా నిర్మాణ కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎంపీ గోడం నగేష్ సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెడుపై విజయం సాధించినందుకు జరుపుకునే గొప్ప పండుగ దసరా అని అన్నారు. ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమం లో ఉత్సవ సమితి అధ్యక్షులు హన్మండ్లు, ప్రధాన కార్యదర్శి రాళ్లబండి మహేందర్, బీజేపీ నాయకులు భరత్, కృష్ణ యాదవ్, జ్యోతి రెడ్డి, సూర్య కిరణ్,  తదితరులు పాల్గొన్నారు.