07-08-2025 12:27:03 AM
పటాన్ చెరు, ఆగస్టు 6 : పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో రూ.3.76 కోట్లతో చేపట్టే సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, రుద్రారం పీఏసీఎస్ చైర్మన్ పాండు, విద్యుత్ శాఖ ఏడీ తులసీరామ్, దశరథ రెడ్డి, శ్రీనివాస్, నాయకులు మేరాజ్ ఖాన్, రామకృష్ణ, రవి పాల్గొన్నారు.
అలాగే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగిలో తెలంగాణ వీరభద్రీయ కుల సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ యువనేత మాదిరి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. కుల సంఘ భవనాలు ఐకత్యతను పెంచుతాయన్నారు. వీరభద్రీయ కులస్తులకు తమవంతు సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరభద్రీయ కులస్తుల సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.