29-08-2025 11:38:08 PM
నూతన జిల్లా వైద్యాధికారిగా వాణిశ్రీ నియామకం
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారి ఆకస్మిక బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న వాణిశ్రీని జిల్లా వైద్యాధికారిగా నియమించారు. గత కొంతకాలంగా డిఎంహెచ్ఓపై పలు ఆరోపణలు రావడంతో పాటు, ఆమె ఒంటెద్దు పోకుటతో వైద్య సిబ్బందితో పాటు జిల్లాలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీంతో జిల్లా కలెక్టర్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆమెపై విచారణ జరిపి ఆకస్మిక ఆకస్మిక బదిలీ చేసినట్లు తెలుస్తోంది.