30-08-2025 12:01:35 AM
-బాసర సోన్ వద్ద ప్రమాదకర స్థితిలో గోదావరి వరద
-నీట మునిగిన పుష్కర ఘాట్లు రైల్వే సర్వీసులు
-అమ్మవారి ఆలయం వరకు వరద నీరు
-ఎస్సారెస్పీ దిగువ ప్రాంతంలో 3 ఎకరాలు పంట నష్టం
-8 గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు
నిర్మల్ ఆగస్టు 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వర్షాలు తగ్గిన గోదావరిలో వరద నీరు తగ్గకపోగా మరింత ఉధృతం కావడంతో గోదావరి తీర ప్రాంత ప్రజలు రైతులు క్షణం క్షణం భయం భయంగా జీవనం గడుపుతున్నారు. మూడు రోజులుగా గోదావరి నదిలో కి పరివాహ ప్రాంతాల నుంచి రికార్డ్ స్థాయి లో వరద నీరు వచ్చి చేరుతున్నంతో ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గ్రామాల్లో వేలాది ఎకరా ల పంట నష్టం జరిగింది. అనేక గ్రాముల దరిదాపులోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో వర్షాలు తగ్గిన, గోదావరి పరివాహ ప్రాంతాలైన మహారాష్ర్ట నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో గోదావరి కి వరద పోటెత్తింది. శుక్రవారం ఉదయం బాసర వద్ద గోదావరి నది రెండు గడ్డలను దాటి కిలోమీటర్ పొడవున వరద నీరు నిలిచిపోవడంతో బాసరలో లోతట్టు జలదిగ్భంలో చిక్కుకున్నాయి, బాసర బైంసా బ్రిడ్జితోపాటు రైల్వే బ్రిడ్జిని ఆనుకొని బాసర గోదావరి నది ప్రవహించడంతో రైల్వే రాకపోకలను నిలిపివేశారు, బాసరలోని పుష్కర ఘా ట్లు రోడ్డుపై వరద నీరు చేయబడడంతో క్యాటే జ్ ల వరకు నీరు వచ్చి చేరింది. సరస్వతి నగర్ వివిధ కాలనీలు జలమయమై కావడంతో అధికారులు డాక్టర్ల సాయంతో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బాసర లోకేశ్వరం దిల్వార్పూర్ నర్సాపూర్ కుంటల తదితర మండలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సుమారు 3000 ఎకరాలు మొక్కజొన్న సోయా పత్తి వరి పంటలు నీటి లో మునిగాయి ఎకరాలు గోదావరి నది నీటి తో ముంచేత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాసరకు సుమారు నాలుగు లక్షల 4.70 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాంతో ఎస్సారెస్పీ 39 గేట్ల ద్వారా 5.71 లక్ష ల క్యూసెక్కుల నీటిని కిందికి బదులుతున్నా రు. మహారాష్ర్టలో కురిసిన వర్షాల వల్ల తా నూర్ మండలంలోని ఐదు గ్రామాలు వరద లు చుట్టుముట్టాయి. బైంసా మండలంలోని గుండెగామలో వరద నీరు వచ్చి చేరింది .
ఎస్సారెస్పీ దిగువన ప్రమాదకర స్థితి
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి రికార్డ్ స్థాయిలో 5.71 లక్షల క్యూసెక్కులన్నిటిని 49 గేట్ల ద్వారా నదిలోకి వదలడంతో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. సోన్ మండలంలోని పాక్ పట్ల మాదాపూర్ సొన్ కూచం పల్లి లక్మచంద్ర మండలంలోని తిరుపల్లి మునిపల్లి పారుపల్లి మామడ మండలంలోని ఫోన్ కాల్ కోమల్కోట్ పోతారం తదితర గ్రామాల్లో ఆనుకుని ఎస్సారెస్పీ వరద నీరు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ గ్రామాల్లో సుమారు రెండువేల ఎకరాల వరకు వివిధ పంటల్లో వరద నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మాదాపూర్ గ్రామం వద్ద స్వర్ణ నీరు తెలుసుకోవడంతో రాకపోకలను నిలిపివేశారు. ముసళ్ల సంరక్షణ కేంద్రం , ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామూహిక పకృతి వనం వరద నీటితో మునిగిపోయింది. సోన్ పాత బ్రిడ్జిని ఆనుకొని నీరు ప్రవహిస్తుండగా పర్యాటకులను నిలిపివేశారు. గోదావరి పర్యాయప ప్రాంతాల్లో ప్రజలు పశువులు వెళ్ళవద్ద ని రెవిన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. 200 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ తోటలు దెబ్బతిన్నాయి. గోదావరి పరివక ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానక షర్మిల పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను టాక్టర్ ల సాయంత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించారు.