calender_icon.png 16 September, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే

16-09-2025 12:29:27 AM

ములకలపల్లి, సెప్టెంబర్ 15, (విజయ క్రాంతి): అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం మూకమామిడిలోని ఏకలవ్య మోడ ల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా సం దర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా విధానం వి ద్యా వసతులు ఉపాధ్యాయుల పనితీరు మధ్యాహ్న భోజనం తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారికి నాణ్యమైన విద్య అందించి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

విద్యార్థుల విషయంలో చిన్నపాటి అలసత్వం కూడా వహించరాదని సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో ఉన్న చిన్నపాటి లోపాలను వెంటనే సరిచేసేలా సంబంధిత అధికారులకు సూచించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందుకోసం ఎప్పటికప్పుడు తన పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.