calender_icon.png 16 September, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

16-09-2025 12:28:30 AM

వివరాలు వెల్లడించిన కోదాడ డీఎస్పీ 

కోదాడ, సెప్టెంబర్ 15 : తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న దొంగను అనంతగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సోమవారం కోదాడ రూరల్ సీఐ కార్యాలయంలో డి.ఎస్పి శ్రీధర్ రెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం... అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో బండ్ల భాస్కర్  మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తు న్నాడు. పని అయిపోయిన తర్వాత తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు  పాల్పడుతు న్నాడు.

ఇట్టి క్రమంలో 30.94 గ్రాములు బంగారం 180.06 గ్రాముల వెండి ఆభరణాలను దొంగలించాడు. గతంలో కుదువపెట్టిన ఎస్బిఎఫ్సి గోల్ ఫైనాన్స్ నందు కుదువ పెట్టేందుకు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు.

నిందితుడి నుండి స్మార్ట్ మొబైల్ ఫోన్ 59.15 గ్రాముల బంగారం, 180.06 గ్రాముల వెండి ఆభరణాల సొత్తు విలువ సుమారు 6,18,000 లుగా ఉంటుంది. నేరస్థుడైన భాస్కర్ ను రిమాండ్ కు నిమిత్తం పంపించడం జరి గిందని తెలిపారు. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం, అనంతగిరి ఎస్త్స్ర నవీన్ కుమార్, సిబ్బం ది ఎం రామారావు, నిరంజన్, ఏడుకొండలు, నరసింహరావులను డిఎస్పి అభినందించారు.