calender_icon.png 10 May, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రక్షణ నిధికి నెల జీతం విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

10-05-2025 06:29:38 PM

కరీంనగర్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునందుకొని తాను సైతం దేశ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని అందజేసి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తన గొప్ప మనసును చాటుకున్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ అని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ... నేను భారతీయుడను-నేను భారత సైన్యానికి మద్దతుగా నిలబడతానని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఇండియన్ ఆర్మీకి   మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందన్నారు. సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొడుతున్న   భారత ఆర్మీ వీరులకు నా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.

దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ,  తమ కర్తవ్యంగా  దేశ రక్షణ నిధికి ప్రజా ప్రతినిధులు  ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు. పహాల్గంలో  అమాయక ప్రజల ఉసురు తీసి విర్రవీగుతున్న  ఉగ్రముకలు, వారిని భారతదేశం పైకి  ఉసిగలిపిన  పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో  ఇండియన్ ఆర్మీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి భారతదేశ పౌరులు మద్దతుగా నిలబడే సమయం వచ్చిందన్నారు. నేను భారతీయుడిని, దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడుతున్న భారత వీర జవాన్లకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు  తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లోని  కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా  దేశ రక్షణ నిధికి  విరాళం అందజేయాలని సూచించారు.