calender_icon.png 11 May, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి

10-05-2025 09:46:26 PM

పాపన్నపేట: ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అన్నారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జనుముల శివరాములు (35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం గ్రామ శివారులోని కొత్తకుంట వద్ద ఉపాధి హామీ పనుల కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అందరూ కలసి వెళ్లారు.

అందరూ పనులు చేస్తుండగా శివరాములు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలో ఉన్న చెక్ డ్యాం వద్దకు వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీట మునిగిపోయాడు. అతను తిరిగి రాకపోయేసరికి కుటుంబీకులు చెక్ డ్యాం వద్దకు వెళ్లగా ఒడ్డున చెప్పులు కనిపించాయి. నీటిలో గాలించగా మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.