10-05-2025 09:38:28 PM
భూత్పూర్: మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం భూత్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి పనులను త్వరితగతిగా పూర్తి చేయాలని, ఈజీఎస్ ద్వారా మంజూరైన డ్రైనేజీలు ముందుగా వేసిన తర్వాత సీసీ రోడ్లు వెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవోలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కే సి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి లిక్కీ విజయ్ గౌడ్ తో పాటు తదితరులు ఉన్నారు.