20-05-2025 01:23:50 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. మే 19(విజయక్రాంతి) : నిబంధనల మేరకు అనుమతులు జారీ చేయాలని జి ల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 2010 పై వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్, స్కానింగ్, ల్యాబ్ ల ఏర్పాటు కోసం వచ్చిన 21 అనుమతుల దరఖాస్తుల పై జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి వైద్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, స్టాంపింగ్, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ , నోటరీ, బిల్డింగ్ కండిషన్ అన్ని సక్రమంగా ఉన్నాయా ? లేదా అని నోడల్ అధికారిని డాక్టర్ శైలజ ను ఆమె అడిగి తెలుసుకున్నారు.
శాఖాపరమైన అన్ని నిబంధనలను పాటించి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, ఐ ఎం ఓ అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జున్, డీపీవో భిక్షపతి, అశోక్ పాల్గొన్నారు.
నారాయణపేట. మే 19 (విజయక్రాంతి): మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్, ఐసిపిఎస్, , చైల్ హెల్ప్ లైన్ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాల్యవివాహాలు లేని గ్రామాలుగా మార్చాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణపై ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి కలెక్టర్ పా ల్గొన్నారు.
సమావేశం ప్రారంభంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్, (ఇంచార్జ్ డీ డబ్ల్యు ఓ) సంచిత్ గ్యాంగ్వర్ శాఖా పరంగా బాల్య వివాహాల నివారణకు చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి సమావేశంలో క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. గ్రామాలు, మండలాల వారిగా సమావేశాలు నిర్వహింపజేసి బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు.
జిల్లాలో బడి బయట బా లికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి వారి వివరాలతో కూడిన జాబితాను త యారు చేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బాలిక మండలి కమిటీల సమావేశాలను ఎజెండాతో నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో సంబంధిత ఎమ్మార్వోలు, సిడిపిఓలు అలాగే గ్రామస్థాయిలో అంగన్వాడి టీచర్లు, అంగన్వాడి సూపర్వైజర్లు పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకోవాలన్నారు.
జిల్లాలో ఇకపై జరిగే పెళ్లిలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకునేలా అవగాహన కల్పించాలని, ఆధార్ కేంద్రాలలో వయస్సు పెంచి ఆధార్ కార్డు జారీ చేయకుండా ఆధార్ కేంద్రాల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తామని అన్నారు. బాల్య వివాహాలను ఆపేందుకు వెళ్ళే సమయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో చైల్ హెల్ఫ్ లైన్ జిల్లా సమన్వయ కర్త నర్సిములు 2024 లో మొత్తం 36 బాల్య వివాహాలను జరగకుండా నివారించామని, 10 బాల్య వివాహాలకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయించడం జరిగిందని, అలాగే 2025 లో ఇప్పటి వరకు 24 బాల్య వివాహాలను ఆపామని, 3 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయించడం జరిగిందని వివరించారు.
ఈ సమావేశంలో డీ ఎస్పీ నల్లపు లింగయ్య , డీ అర్డిఓ మొగులప్ప, డిపిఓ సుధాకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, సి డబ్ల్యు సీ ఛైర్మెన్ అశోక్ కుమార్, ఇంచార్జ్ డిసిపిఓ తిరుప తయ్య డీ పి వో బిక్షపతి, అన్ని మండలాల తహసీల్దార్లు, సీ డీ పి వోలు, అంగన్ వాడీ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.