23-05-2025 02:13:52 AM
సింగరేణి భవన్లో సీఎండీతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్
రామగుండం,మే22విజయ క్రాంతి): సింగరేణి భవన్లో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం నాయక్ ను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ మర్యాదపూర్వకంగా క లిశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏరియా హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలందించేందు కు అనేక కీలక అభ్యర్థనలు చేశారు.
ఏరియా హాస్పిటల్ను రామగుండం ప్రాంతంలోని కార్మికులకే కాకుండా మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి , భూపాలపల్లి ప్రాంతాల నుండి కూడా వేలాదిమంది సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవల కోసం ఆశ్రయిస్తున్నారని, ఈ నేపథ్యంలో హాస్పిటల్ సదుపాయాలను విస్తరించడం అత్యవసరమని, ఎమ్మెల్యే కోరారు.
సాంకేతిక సిబ్బంది నియామకాలు చెపట్టాలి 2డి ఇంకో, టిఎంటి, టెక్నీషియన్/ఆపరేటర్ నియామకం కోసం కూడా ప్రతిపాదన చేశారు. ఈ పరీక్షలు గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తాయనన్నారు. హాస్పిటల్ను ఒక ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన, కార్మికులకు సులభంగా అందుబాటులో ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, సీఎండి కి ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం లో కోరారు.