calender_icon.png 21 July, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు ఆహ్వాన పత్రం అందించిన ఎమ్మెల్యే

19-07-2025 11:08:28 PM

మూసాపేటలోని ఫార్మా కంపెనీ రెండవ యూనిట్ ను ప్రారంభించేందుకు సీఎంను కోరిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి..

ముసాపేట: దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండల పరిధిలో గల ఫార్మా కంపెనీ రెండో యూనిట్లు ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA G Madhusudan Reddy) ఆహ్వాన పత్రికను హైదరాబాద్ లో కలిసి అందజేశారు. మూసాపేట్ మండలం వేముల గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన ఎస్జిడి (కో-జెంట్) ఫార్మా కంపెనీ రెండో యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో సానుకూలంగా స్పందించారని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. సీఎం ఆహ్వానించిన వారిలో ఎస్జిడి ఫార్మా జనరల్ మేనేజర్ దీపాక్ సూద్ ఉన్నారు.