30-08-2025 12:26:41 AM
నాగల్ గిద్ద, ఆగస్టు 29: నాగల్ గిద్ద మండల పరిధిలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఎస్గి చెరువు, గౌడగోవ్ జన్వాడ లో మంజీరా నది ప్రవాహాన్ని, ఔదత్ పూర్ బ్రిడ్జి కారాముంగి గ్రామంలో మంజీరా నది ప్రవాహాన్ని పరిశీలించి భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరామర్శించారు. పంట నష్టం నివేదిక తయారు చేసి ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారికి సూచించారు.
ఔదత్ పూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించారు. శక్రునాయక్ తండా గ్రామ పంచాయతీలోని శ్యామ నాయక్ తాండకు వెళ్లే రహదారి మార్గంలో రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుతున్నామని తాండవాసులు ఎమ్మెల్యే సంజీవరెడ్డికి తెలిపారు. వంతెన పరిశీలించి నిర్మాణ పనులు మొదలుపెట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యే వెంట తహసిల్దార్ శివకృష్ణ, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ అనిల్ పాటిల్, గుండె రావు పాటిల్, మనోహర్రావు పాటిల్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు నారాయణ జాదవ్, నర్సింగ్ పాటిల్, అబ్దుల్ రహీం, అంబాజీ సంతోష్, పండరి రెడ్డి మాజీ ఎంపిటిసి, బి రాజు, హనుమంతు, రాజు పాల్గొన్నారు.