30-08-2025 12:27:33 AM
జలమండలి ట్రేడ్ యూనియన్స్ జేఏసీ చైర్మన్ మొగుళ్ల రాజురెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి): జలమండలిలో అధికార యూని యన్ బి.ఆర్.టి.యు పదేళ్ల కాలంలో కార్మికులను, ఉద్యోగులను పట్టించుకోలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను విస్మరించిందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ (హెచ్‌ఎం డబ్లు ఎస్‌ఎస్‌బి) ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ఛైర్మన్ మొగుళ్ల రాజి రెడ్డి దుయ్యబట్టారు.
కార్మికులు ఎంతో నమ్మకంతో బి.ఆర్.టి. యును గెలిపిస్తే, ఆ యూనియన్ కనీసం ఒవర్ టైమ్ (ఒటి ) నష్టపరిహారం బకాయిలను కూడా ఇప్పించలేక పోయిందని విమ ర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తాము కార్మికులకు, ఉద్యోగులకు అండగా నిలిచామని, ఒటి నష్టపరిహారం బకాయిలను కూడా మంజూరు చేయించామని వివరించారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడి జూలై వరకు ఉన్న ఒటి నష్టపరిహార బకాయిలను మంజూరు చేయించి నందుకు హర్షం వ్యక్తం చేస్తూ (హెచ్.ఎం, డబ్లు,ఎస్,ఎస్,బి) అన్ని డివిజన్ల కార్మికులు, ఉద్యోగులు, క్యూ. ఎ. టి విభాగంలో ఏడు కొత్త పోస్టులు మంజూరు కావడంతో పదోన్నతి పొందిన వారు కూడా హైదరాబాద్ నారాయణగూడ లోని ఐ.ఎన్. టి.యు.సి రాష్ట్ర కార్యాలయంలో మొగుళ్ల రాజిరెడ్డిని శుక్రవారం శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ప్రభుత్వంతో మా ట్లాడి తమకు రావాల్సిన ఒటి నష్టపరిహారం బకాయిలను చెల్లించేందుకు కృషి చేసిన రాజిరెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు జేఏసీ రాఘవేంద్ర రాజు, అల్లి శ్రవాన్ కుమార్, ఎండీ జాంగిర్, బి.దేవేందర్, సైద్ అక్తర్ అలీ, బి. నర్సింగ్ రావు, బి. జయ్ రాజ్, బి. మహేష్, బి. సాయి చరణ్, నేతలు రామ్ చందర్, శంకర్ ప్రకాష్, మజారుద్దీన్, హాసిం, అజయ్ నాథ్, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గౌస్ పాషా, మొగులయ్య, నర్సింగ్ రాజు, అశోక్, బి. మహేష్, వినోద్ గౌడ్ పాల్గొన్నారు.