calender_icon.png 5 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటాం

05-12-2025 12:00:00 AM

15, 16 తేదీల్లో చలో ఢిల్లీ

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : స్థానిక ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేసి చీకటి ఒప్పదం చేసుకున్నాయని ఆరోపించారు.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ నేతలు కుందారం గణేష్ చారి, గుజ్జ కృష్ణ, కులకచర్ల శ్రీనివాస్ లతో కలసి ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ’ఛలో ఢిల్లీ’ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అంశాన్ని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ లేవనెత్తలేదని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ కి ప్రధాని మోడీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను ఆహ్వానిం చడానికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.

కానీ బీసీ డిమాండ్లపై చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి అని మండిపడ్డారు. ఈనెల 15న పార్లమెంట్ ముట్టడిస్తామని, 16న కేంద్ర మంత్రులు ఇండ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు విక్రమ్ గౌడ్, లింగం, ప్రొఫెసర్ బాగయ్య, కవుల జగన్నాథం, మహిళా నేతలు తారాకేశ్వరి, సం ధ్య, ఉదయ్ నేత, తదితరులు పాల్గొన్నారు.