18-08-2025 12:00:00 AM
బిచ్కుంద ఆగష్టు 17 ః కామారెడ్డి జిల్లా ఈనెల 20వ తేదీన పంచాయతీరాజ్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ర్ట ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి ఏకో టూరిజంను పనులను శంకుస్థాపన చేసి పెద్ద కొడంగల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద సభ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా పెద్దకొడంగల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద సభా స్థలమును ఎమ్మెల్యే నాయకులతో కలిసి పరిశీలించారు.ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,నాయకులు శామప్పపటేల్,మల్లప్ప పటేల్,అహ్మద్, నాగిరెడ్డి, బస్వరాజ్ దేశాయ్,సంతోష్ దేశాయ్, కల్లూరి పండరి, డాక్టర్ సంజీవ్,మోహన్,ఇస్మాయిల్, మొగుల గౌడ్, పాండు నాయక్,జాగోర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.