calender_icon.png 15 August, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈషా గ్రామోత్సవం వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

15-08-2025 12:34:56 AM

సంగారెడ్డి, ఆగస్టు 14: ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామోత్సవం వేడుకకు సంబంధించిన వాల్ పోస్టరును క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆవిష్కరించారు. ఆటలు సామరస్యాన్ని, ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఈశా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా గ్రామోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆటల ద్వారా, వినోదంతోపాటు, అంతరించిపోతున్న సంప్రదాయ కళల పునరుద్ధరణే లక్ష్యంగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల క్రీడలను ప్రోత్సహించడానికి ఈనెల 23 తేదీన సంగారెడ్డి అంబేద్కర్ మైనదానంలో పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పురుషులకు 14 సంవత్సరాలు, మహిళలు 13 - 21 పైబడి ఉన్నవారు అర్హులని, గెలుపొందిన వారికి నగదును అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, ఈషా వాలెంటరస్ పవన్ కుమార్ ,సుభాన్, మనోజ్, జీవి శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, విఠల్, మోహన్ , సుమలత , భాను, లక్ష్మణ్, తదితరులుపాల్గొన్నారు.