18-08-2025 12:32:47 AM
జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి. ధర్మానాయక్
నల్గొండ రూరల్ ఆగస్టు 17 ః డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో; తక్కువ పీజులతో అడ్మిషన్లు పొందెందుకు ఈనెల 30 వ తేదీ చివరి గడువు; ఉందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి. ధర్మానాయక్ తెలిపారు.
ఆదివారం నల్లగొండ లోని; యూనివర్సిటీ రీజినల్ సెంటర్ లో; ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ; తక్కువ పీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించిని ఉన్నత విద్యను; బిఆర్‌ఓయు లో బిఎ, బికాం, బిఎస్ సి,; ఎంఏ, ఎంకాం, ఎం ఎస్ సి, డిప్లొమా కోర్సులలో చదువుకునే%ళి%దుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయంతో సమత’ ఫ్రీషిప్లు నిపుణ ఫెలోషిప్లు ఇవ్వబోతున్నామన్నారు. సమత ప్లీషిప్ ఆదివాసీలు, ప్రాచీన గిరిజనులు, ట్రాన్స్ జెండర్ ప్రజలు, శారీరక వికలాంగులు; దివ్యాంగులకు ఉచిత విద్యను అందించబోతున్నాంఅని తెలిపారు.
దీనివల్ల తెలంగాణలో ట్రాన్స్ జెండర్ తోపాటు దివ్యాంగులు, గోండు కోయ, చెంచు ఆదివాసులు ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వివిధ కారణాల చేత తమ విద్యను మధ్యలో వదిలేసిన వారు,; గృహిణిలు, ఉద్యోగస్తులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా యూనివర్సిటీ అందిస్తున్నటువంటి;
అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలన్నారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, ఎన్ జి కాలేజీ అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవి,రాజారామ్ పున్న అంజయ్య,ఉన్నారు.