23-09-2025 12:00:00 AM
నిర్మల్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : స్వచ్ఛ సర్వేక్షన్-2025 లో భాగంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతుంది. దీని ఉద్దేశం ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం.
దీనిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈరోజు మహిళా సంఘ సభ్యులకు తడి పొడి చెత్త మరియు హానికార చెత్త ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు స్వచ్ఛత ప్లెడ్జ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్లు దేవదాసు, ప్రవీణ్ కుమార్, టిఎంసి దత్తాద్రి, ఎడి ఎంసీలు శివ, సురేష్ , మహిళా సంఘ సభ్యులు మరియుమున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.