28-01-2026 12:12:52 AM
మాజీ బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ
సికింద్రాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): కంటోన్మెంట్ ఎమ్మెల్యే డ్రామా దీక్షలు చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కంటోన్మెంట్ బోర్డ్ మాజీ నామినేటెడ్ సభ్యుడు, బిజెపి నాయకుడు జె.రామ కృష్ణ ఆరోపించారు. ఈ మేరకు మంగళవా రం కంటోన్మెంట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌కి ఒక ప్రత్యేకత ఉంటుందని, కంటో న్మెంట్‌లోని బంగ్లాలు, ఆర్మీల్యాండ్‌లోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి విలీనం నాటకమాడుతున్నారని ఆరోపించారు.
జిహెచ్‌ఎంసిలోనే ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కాంట్రాక్టర్ల బిల్లులు లేక ధర్నాలు చేసే పరిస్థితి జిహెచ్‌ఎంసిలో ఉంద ని, అలాంటప్పుడు ప్రశాంతంగా ఉన్న కంటోన్మెంట్‌ను జిహెచ్‌ఎంసి లో కలపడం వల్ల లాభమేంటో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మీకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నాలు చేసి సర్వీస్ చార్జీల తెప్పించుకునే ప్రయత్నం చేయాలని ఆయన సవాల్ విసిరారు.