28-01-2026 12:14:23 AM
మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి
మేడిపల్లి, జనవరి 27 (విజయక్రాంతి): వాహనదారులు అందరూ సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బోడుప్పల్ కమాన్ ఉప్పల్ డిపో వద్ద విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు వాహనదా రులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు కృష్ణయ్య, తిరుపతి, రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.