calender_icon.png 15 July, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ హైకోర్టుకు ఎమ్మెల్సీ కవిత

10-05-2024 02:04:33 AM

బెయిల్ కావాలని కోరుతూ పిటిషన్

ఇవాళ పిటిషన్‌పై విచారణ జరిపే అవకాశం

న్యూఢిల్లీ, మే 9: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. కాగా, ఆమెకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 20 వరకు కస్టడీ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సౌత్ గ్రూప్ పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది.

మనీ లాండరింగ్ వ్యవహా రంలో విచారణ జరిపేందుకు ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. తర్వాత  జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు పం పారు. జైలులో ఉండగానే ఆమెను సీబీఐ అరెస్టు చేసింది. కాగా, లిక్కర్ కేసులో కవిత ప్రధాన సూత్రధారి అని, ఆమె పాత్రపై వారం రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని ఈడీ అధికారులు కోర్టుకు తెలపడడంతో ఆమె కస్టడీని పొడిగించారు.