11-05-2024 12:05:00 AM
న్యూయార్క్ వీధిలో అమానుష ఘటన
న్యూయార్క్, మే 10 (విజయక్రాంతి) : అమెరికాలోని న్యూయార్క్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడకు బెల్ట్ చుట్టి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన పది రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. మే 1న న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్ పరిసరాల్లో తెల్ల వారుజామున 3 గంటలకు 45 ఏళ్ల మహిళ తన ఇంటికి నడుచుకుం టూ వెళ్తోంది. ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి.. ఆమె మెడకు బెల్ట్ చుట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనం తరం ఆమెను కారు వెనక్కి లాక్కెళ్లి అత్యా చారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిం ది. ఈ ఘటనపై మహిళలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. నింది తుడిని కఠినంగా శిక్షించాలని డిమాం డ్ చేస్తున్నారు. కాగా, అమాను ష ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేం దుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిం దితుడు ముఖానికి మాస్క్ ధరించు కుని ఉండటంతో అతడి జాడ కనుక్కో వడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులైనప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా, బాధిత మహిళకు నిందితుడు పరిచయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.