19-11-2025 12:00:00 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
వేములవాడ ఏరియా ఆసుపత్రికి సీఎస్‌ఆర్ నిధులు
రూ.కోటి 80లక్షలు విలువైన పరికరాలు ప్రారంభం
పాల్గొన్న ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 18 (విజయక్రాంతి) : వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. సీఎస్‌ఆర్ కింద వేములవాడ ఏరియా ఆసుపత్రికి అందించిన రూ. కోటి 80 లక్షల విలువైన వైద్య పరికరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్, ఇతర విభాగాల్లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి, వాటి వినియోగం పై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యంతో సీఎస్‌ఆర్ కింద కోటి 80 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను అందించామని తెలిపారు.
వైద్యులు ఆయా పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. ప్రజలు ఆయా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈసీజీ మిషన్లు, మల్టీ మానిటర్, ఆటో క్లేవ్ లార్జ్, డైతీర్మి మిషన్, డబుల్ డోర్ ఓటిలైట్, అనస్థీషియా వర్క్ స్టేషన్, ఫెటల్ మానిటర్ సీటీజీ, ఈఎన్టీ సర్జికల్ మైక్రో స్కోప్, మార్చురీ క్యాబినెట్ ఫోర్ బాడీ, జనరల్ సర్జరీ ఓటి టేబుల్, ఎమర్జెన్సీ రికవరీ ట్రోలీ, చైర్ త్రీ సీటర్, ఈఎన్ టీ హెడ్ లైట్, సిరంజీ పంప్ యూనిట్, క్లినికల్ సక్షన్ ఆపరాటస్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.
కార్యక్రమంలో ఆర్డీఓ రాధాభాయ్, తహసిల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, తదితరులు పాల్గొన్నారు.