calender_icon.png 15 August, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

15-08-2025 12:56:59 AM

కొత్తపల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి) : కొత్తపల్లిలో ని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల, వావిలాలపల్లిలో అల్ఫోర్స్ టైనీ టాట్స్ ,  అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్,  కిసాన్ నగర్ లో అల్ఫోర్స్ హై స్కూల్, భగత్ నగర్ లో  అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్, మంకమ్మతోటలో గల అల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్ లో గురువారం ముందస్తు శ్రీ కృష్ణాష్టమి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై శ్రీకృష్ణుని విగ్రహానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి, పూలమాలలను సమర్పించి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశంలోనే కాకుండా ప్రపంచంలో  ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారని చెప్పారు. శ్రీకృష్ణుని చరిత్ర చాలా విశిష్టమైనదని మరియు ధర్మము గురించి తెలిపినటువంటి విషయాలు ఆలోచింప చేస్తాయని చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా గోవర్ధన గొప్పతనం నాటిక చాలా ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.