15-08-2025 12:55:36 AM
కొత్తపల్లి, ఆగష్టు 14 (విజయక్రాంతి) : సిద్ధార్థ విద్యాసంస్థల యందు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ఆవరణాన్ని చిన్ని కృష్ణుని చిన్ని చిన్ని అడుగులతో, రంగ వల్లులతో, పూలతో, అందమైన చీరల నడుమ చిన్ని కృష్ణుని ప్రతిమను అందంగా అలంకరించారు. విద్యార్థులందరూ కూడా కృష్ణునికి అనుసంధానమైనటువంటి వివిధ వేషధారణలు అనగా యశోద, గోపికలు, గొల్లభామలు, నారదుడు, కంసుడు, పూతన (రాక్షసి), కుచేలుడు, చిన్నికృష్ణుని రూపాలతో పాఠశాల ప్రాంగణమంతా రేపల్లెలా కొలువుతీరింది.
చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి , డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న నాగరికతా సమాజంలో పిల్లల్లో ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి పండుగలు చాలా దోహదపడుతాయని అన్నారు. వేషధారణతో ఉన్న విద్యార్థులు చిన్ని కృష్ణుని పద్యాలు, పాటలు పాడారు, మరియు చిన్ని కృష్ణుని కథలు చెప్పారు.
ప్రాంగణమంతా చిన్ని చిన్ని గోపాలకుల సందడితో గోపికల యొక్క కోలాటాలతో మారుమ్రోగింది. చక్కని వేషధారణ కనబరచిన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ శ్రీపాల్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.