15-08-2025 12:58:26 AM
తిమ్మాపూర్, ఆగస్టు 14 (విజయ క్రాంతి : తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందాడు. మరి కొంతమంది విద్యార్థులకి తీవ్ర గాయాలైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానికుల కథనం మేరకు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీరామ విద్యాలయం పాఠశాల నుంచి మన్నెంపల్లి గ్రామానికి ఆటోలో 15మంది విద్యార్థులను తీసుకొస్తారు. కాగా ప్రతిరోజు మాదిరిగా విద్యార్థులను ఆటోలో తీసుకు వస్తుండగా ఆటోకు అడ్డంగా కుక్క అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి బోల్తా పడింది.
దీంతో ఆటోలో పిల్లలు ఇరుక్కున్నారు. స్థానికులు హుటాహుటిగా ఘట న స్థలానికి చేరుకొని పిల్లలను బయటకు తీశారు. ఆటోలో తోటి విద్యార్థులతో పాటు కలిసి వచ్చిన 4వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్(10), తలకు తీవ్ర గాయాలు కావడంతో గ్రామ మాజీ సర్పం మేడి అంజయ్య, ఉపసర్పం పొన్నం అనిల్ గౌడ్,లు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలో హర్షవర్ధన్ మృతి చెందడంతో తల్లిదండ్రులు విలపించారు.