calender_icon.png 14 September, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ నిరాకరణ

14-12-2024 01:12:55 AM

  1. విలేకరిపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరణ
  2. ఫిర్యాదులో ఆరోపణల తీవ్రత దృష్ట్యా..
  3. పోలీసుల కౌంటర్ దాఖలుకు ఆదేశం
  4. బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకుని సెక్షన్లను సవరించారు : ఏపీపీ
  5. విచారణ 19కి వాయిదా

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): విలేకరిపై దాడి కేసులో సినీ నటు డు మోహన్‌బాబు దాఖలు చేసిన ముంద స్తు బెయిలు పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఫిర్యాదులో ఆరోపణల తీవ్రత ఉన్న నేపథ్యంలో అరెస్ట్ నుంచి ఎలాంటి మినహా యింపులు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఇందు లో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాదుదా రు ఎం.రంజిత్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. విలేకరిపై దాడికి సంబంధించి నమోదైన కేసులో ముందస్తు బెయి లు మంజూరు చేయాలంటూ మోహన్‌బా బు శుక్రవారం ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ డిసెంబరు 10న జరిగిన సంఘటనలో నమోదైన కేసును పోలీసులు సవరించారని, హత్యాయత్నం కింద కేసు మార్చారన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు.

అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్ రావు వీరమల్ల వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కుమారుడు మనోజ్ ఆహ్వానం మేరకు విలేకరులు వెళ్లారన్నారు. లోగో ఉన్న మైక్‌తో కొట్టడంతో సున్నితమైన ప్రాంతంలో తీవ్రగాయమైందన్నారు. బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకుని సెక్షన్లను సవరించినట్లు తెలిపారు.

వాదనలను విన్న న్యాయమూర్తి  మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ,. పోలీసులు కౌంటరు దాఖలు చేసిన తరువాత ఈ పిటిషన్‌ను తేల్చుతామంటూ విచారణను వాయిదా వేశారు.