calender_icon.png 14 September, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేం నరేందర్‌రెడ్డి కొడుకు పిటిషన్ డిస్మిస్

14-12-2024 01:17:35 AM

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఓటుకు నోటు కేసులో వేం నరేందర్‌రెడ్డి కొడుకు వేం కృష్ణకీర్తన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులను కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈడీ నోటీసులపై కృష్ణకీర్తన్ సవాల్ చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది.

ఓటుకు నోటు కేసులో నాటి ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ముడుపులుగా ఇచ్చిన మొత్తాన్ని  కృష్ణకీర్తన్ సమకూర్చారంటూ ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన ఈడీ ప్రత్యేక కోర్టు 2021 ఆగస్టు 9న కృష్ణ కీర్తన్‌కు సమన్లు జారీ చేసింది.

ఈడీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టివేయాలంటూ కృష్ణకీర్తన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. కేసులో తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో వీటిని కింది కోర్టు విచారణలోనే తేల్చుకోవాలని పేర్కొన్నారు.