12-05-2025 01:43:12 AM
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పాటైన తర్వాత విశ్వవేదికపై రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు మారుమోగేలా మిస్‌వరల్డ్ 2025 పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిం చింది. దాదాపు మూడువారాల పాటు ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈనెల 10న ఆరంభమైన పోటీలు ఈనెల 31న జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగుస్తాయి.
ఇటు రాష్ట్ర పర్యాటక శాఖ అటు మిస్ వరల్డ్ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కానీ, మన దేశానికి పాకిస్థాన్‌కు మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో నిర్వాహకులు, ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొ ందన్న వార్తలు వెలువడ్డాయి. దీనికి తోడు ఐపీఎల్ సైతం వాయిదా పడటంతో అందా ల పోటీల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
దీనితో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా పడతాయన్న వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రతిపక్ష బీఆర్ ఎస్ నేతలు కూడా యుద్ధవాతావరణంలో అందాల పోటీలా? అని ప్రశ్నిస్తూ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం వరకూ పోటీలపై టెన్షన్ నెలకొన్నది. అయితే సాయంత్రం కాల్పుల విర మణ ప్రకటన రావడంతో నిర్వాహకులు, రా ష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ప్రారంభవేడుకలు విజయవంతం..
అందాల పోటీల ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. సీఎం రేవం త్‌రెడ్డి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీని ప్రతిబింబిం చే కళాప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ కళా, సాంస్కృతిక వారస త్వ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
110 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు తమ తమ దేశానికి చెందిన సంస్కృతీ సంప్రదాయాలతో కూడిన దుస్తులు ధరించి ర్యాంపు మీద నడిచి అలరించారు. ప్రజలు కూడా భారీ ఎత్తున హాజరయ్యారు. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి ప్రస్తుతమున్న ఉద్రిక్త వాతావరణంలో ఏ చిన్న పొరపాటు లేకుండా కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఓపెనింగ్ గ్రాండ్‌గా జరగడంతో నిర్వాహకులు, సంబంధిత ప్రభుత్వ యం త్రాంగం రాబోయే మిగతా కార్యక్రమాలను సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ పోటీలతో తెలంగాణ టూరిజం ప్రతిష్ట పెరగనున్నదన్న ఆశాభావంతో ప్రభుత్వం ఉన్నది. విశ్వవ్యాప్తంగా తెలంగాణ టూరిజానికి మరింత ఖ్యాతిని వస్తుందని భావిస్తోంది.
నేడు నాగార్జునసాగర్‌లో మిస్‌వరల్డ్ పోటీదారుల పర్యటన
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కొంతమంది పోటీదారులు నాగార్జునసాగర్‌లో సోమవారం పర్యటించను న్నారు. సాగర్‌కు సమీపంలో ఉన్న బుద్ధవనంలో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన పోటీదారులు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గరున్న బుద్ధవనాన్ని సందర్శించనున్నారు.
ముందుగా వీరు నల్లగొండ నుంచి బయలుదేరి నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథి గృహం దగ్గర కాసేపు ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయ్‌విహార్ చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు 24మంది లం బాడా కళాకారులు వారికి స్వాగతం పలకనున్నారు. మహాస్థూపం దగ్గర స్వాగతం అనంతరం ఫొటో సెషన్ ఉంటుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మహాస్థూపంలోకి ప్రవేశించిన తర్వాత దానికి సంబంధించిన వివరాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వివరిస్తారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం తర్వాత అక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహాబోధి పూజలు నిర్వహిస్తారు. తదనంతరం జాతక వనాన్ని సందర్శిస్తారు.
బుద్ధవనం ప్రాముఖ్యాన్ని పురావస్తు, టూరిజం ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతకవనం సందర్శనాంతరం బుద్ధచరితంపై 18మంది కళాకారులు ప్రదర్శనను వారు తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వారు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు.