calender_icon.png 11 May, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత సైన్యానికి ఆర్టిస్టుల సంఘీభావ ర్యాలీ

10-05-2025 06:52:22 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): పాకిస్తాన్ తో యుద్ధంలో వీరోచిత పోరాటం చేస్తున్న భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ పట్టణ ఆర్టిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు శ్రీను మాట్లాడుతూ... భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఆర్టిస్టుల సపోర్టు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూర్, ఖదీర్, వాసు, రాజు, సత్యం, లతీఫ్, శీను, నందు, తదితరులు పాల్గొన్నారు.