24-12-2025 02:15:13 AM
మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద
సికింద్రాబాద్/ కంటోన్మెంట్ డిసెంబర్ 23 (విజయక్రాంతి) : మహిళల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ర్ట మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నారీ న్యాయ్ హియర్ హర్ ఔట్ పేరుతో బహిరంగ విచారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బాధిత మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కొనసాగిన ఈ విచారణలో సుమారు 100కు పైగా ఫిర్యాదులు అందాయి. ఉద్యోగ వేధింపులు, గృహ హింస, వివక్ష, ఆర్థిక మోసాలు, సైబర్ క్రైమ్ వంటి అనేక సమస్యలను బాధితులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. చైర్పర్సన్ నేరెళ్ల శారద, అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, ఉమెన్ సేఫ్టీ డీసీపీలు డాక్టర్ లావ ణ్య, టీ ఉషారాణి, డీఆర్వో ఈ వెంకటాచారి స్వయంగా బాధితుల సమస్యలను సానుకూలంగా విని, అక్కడికక్కడే తగు పరిష్కార మా ర్గాలను సూచించారు.
పెండింగ్ ఫిర్యాదులపై వెంటనే నివేదికలు ఇవ్వాలని సంబం ధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధిక శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కేసుల్లో నిందితులుగా ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐ భర్త ల వేధింపుల అంశాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా, శాశ్వత పరిష్కారం దొరికేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ కార్యదర్శి పద్మ జా రమణ, సభ్యులు షాహిన్ అఫ్రోజ్, ఈశ్వ రి బాయ్, శుద్ధం లక్ష్మి, గద్దల పద్మ, కొమ్ము ఉమాదేవి యాదవ్, ఏ రేవతి రావు, జిల్లా సంక్షేమ శాఖాధికారులు అక్కేశ్వర్ రావు, రాజేందర్, ప్రవీణ్ కుమార్, ఆర్ కోటాజీ, జీ ఆశన్న, ఇలియాజ్ అహ్మద్, వివిధ జోన్ల పోలీస్ అధికారులు, సఖి కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.