27-08-2025 01:02:30 AM
దేవరకొండ, ఆగస్టు 26: చందంపేట మండల కేంద్రంలో మంగళ వారం దేవరకొండ శాసనసభ్యులు మార్నింగ్ వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోనీ పలు కాలనీలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించి,గ్రామ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసారు.నూతనంగా 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలతో కలిసి నడవడం వారి సమస్యలను వినడం వాటికి పరిష్కారం చూపడం కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వం ధ్యేయం అని వారు అన్నారు.రైతు రుణమాఫీ , రైతు భరోసా , రేషన్ కార్డులు , ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి స్పందన ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.