27-08-2025 01:03:40 AM
రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం పూట కార్యాలయా ల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఆకస్మిక వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. కాగా రాష్ట్రం లో బుధవారం, గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. బుధవారం కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములు గు జిల్లాల్లో, గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసింది.