calender_icon.png 16 October, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్ లో తల్లి బిడ్డ క్షేమం

16-10-2025 05:19:00 PM

108 సిబ్బందిని అభినందించిన కుటుంబ సభ్యులు..

చండూరు (విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 108 అంబులెన్స్ లో మహిళా ప్రసవించిన సంఘటన చండూరు మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామానికి చెందిన రాజేశ్వరి గురువారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా, 108 సిబ్బంది చేరుకొని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పాప మేడకు బొడ్డుతో చుట్టుకొని ఇబ్బంది పడుతున్న రాజేశ్వరిని చాకచౌక్యంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అంబులెన్స్ లో జరగడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో 108 సిబ్బందిని రాజేశ్వరి కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.