calender_icon.png 26 December, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి, కొడుకు దారుణ హత్య

26-12-2025 01:17:48 AM

  1. నిందితుడి ఆత్మహత్యాయత్నం
  2. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఘటన 

రామచంద్రపురం (పటాన్‌చెరు), డిసెంబర్ 25 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జ్యోతిబాపులే కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళతో పాటు బాలుడు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో నిందితుడు తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ జ్యోతిబాపులే కాలనీలో మహబూబ్‌నగర్‌కు చెం దిన చంద్రకళ (30), ఆమె కుమారుడు రేవం త్ కుమార్ (15) వనపర్తికి చెందిన శివరాజ్ ఐదు రోజుల క్రితం అద్దె ఇంట్లో నివాసానికి వచ్చారు. శివరాజ్, చంద్రకళ సహజీవనంలో ఉన్నట్లు స్థానికుల సమాచారం.

గురువారం ఇంట్లోని ఓ బెడ్రూంలో చంద్రకళ, రేవంత్ కుమార్ రక్తపు మడుగులో మృతి చెంది ఉండగా, శివరాజ్ గొంతు కోయబడి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడిని నల్లగండ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమా చారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఈ ఘటనలో శివరాజ్ తల్లీ, కొడుకులను హత్య చేసి ఆత్మహత్యాయత్నం చేశాడా? లేక మూడో వ్యక్తి ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.