calender_icon.png 26 December, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

25-12-2025 02:18:15 AM

  1. ఇంటి రుణం మాఫీ కోసం దారుణం
  2. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం 
  3. భార్య సహా ముగ్గురి అరెస్ట్
  4. బోడ మంచ్య తండాలో ఉద్రిక్తత 
  5. ఆర్‌ఎంపీ వైద్యుడి బైకు దహనం 
  6. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి 
  7. ఎస్‌ఐ, కానిస్టేబుల్ కు గాయాలు 

కేసముద్రం, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఇంటి రుణం మాఫీ కోసం కట్టుకున్న భర్తను వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, మరొకరితో పథకం ప్రకారం దారుణంగా హత్య చేసి, ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడ మంచ్యా తండాలో తీవ్ర కలకలం సృష్టించింది. కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్ ఐ క్రాంతి కిరణ్ కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తండాకు చెందిన భూక్య వీరన్న (45) అనే వ్యక్తి ని కొందరు తలపై బలమైన ఆయుధంతో కొట్టి హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు పక్కన వేయడమేగాక సైకిల్ మోటార్ ను కిందపడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు యత్నించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వీరన్న హత్య చేసినట్లుగా నిర్ధారించి, మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వీరన్న మృతదేహానికి మంగళవారం రాత్రి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

బుధవారం ఉదయం వీరన్న చావుకు కారణం మృతుడి భార్య, తండాకు చెం దిన బోడ బాలు, ఆర్‌ఎంపీ డాక్టర్ భరత్ కారకులని తండావాసులు వారి ఇండ్లపై దాడికి పూనుకున్నారు. తొలుత ఆర్‌ఎంపీ వైద్యుడు భరత్ నిర్వహిస్తున్న క్లినిక్‌ను ధ్వంసం చేశారు. అనంతరం అతని బైక్ ను రోడ్డుపై వేసి తగలబెట్టారు. ఈ సంఘటన జరుగుతున్న క్రమం లో పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా వారిపై కూడా తండావాసులు  దాడికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు గాయాలు కావడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

వెంటనే మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ క్రాంతికిరణ్ పోలీసులు బలగాలతో అక్కడికి వెళ్లి నిరసన చేస్తున్న వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వీరన్న హ త్య కేసులో అనుమానితులుగా పే ర్కొంటున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనస్థలిని మహబూబాబాద్ డీఎ స్పీ తిరుపతిరావు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కాగాట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరన్నకు ఆర్‌ఎంపీ వైద్యుడు రూ.10 లక్షల గృహ రుణం ఇప్పించాడు.

ఈ క్రమంలో వీరన్న భార్యతో వివాహేతర సం బంధం పెట్టుకున్న బాలుతో కలిసి వీరన్న అడ్డు తొలగిస్తే అటు ఇంటి రుణం మాఫీ కావడంతో పాటు, వివాహేతర సంబంధానికి అడ్డు తొలగిపోతుందని పథకం రచించారు. ఈ క్రమంలో ముగ్గు రూ కలిసి వీరన్నను తలపై బలమైన ఆయుధం తో కొట్టి హత్య చేసి, రోడ్డు పక్కన పడేసి అతని వద్ద సైకిల్ మోటార్ ఉంచి రోడ్డు ప్రమాదంలో మరణించాడని నమ్మించేందుకు ప్రయత్నించారు.

అయితే వీరన్న తలపై గాయం ఉండడం, సైకిల్ మోటా ర్‌కు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజి కాకపోవడం, మృతదేహానికి సమీపం నుండి ఈడ్చుకు వచ్చినట్లు రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చిన మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు వీరన్న భార్య, బాలు, భరత్ పథకం ప్రకారం హత్య చేసినట్లు అంగీకరించారు.