calender_icon.png 13 August, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కాలుష్య’ పరిశ్రమలను త్వరగా తరలించండి

13-08-2025 01:20:59 AM

  1. ‘ఔటర్’ వెలుపలకు మార్చే ప్రక్రియను ముమ్మరం చేయాలి
  2. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంబంధిత అధికారులను ఆదేశించా రు. మంగళవారం సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం నిర్వ హించారు.

ఈ సందర్భంగా కమర్షియల్ టాక్స్, మైనింగ్ శాఖల్లో ఆదాయ ఆర్జనలో మెరుగైన పనితీరు ప్రదర్శించిన అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు అభినందించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్, రెవెన్యూ, సీసీఎల్‌ఏ సెక్రటరీ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.