calender_icon.png 23 July, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ సిద్ధాంతకర్త మధుసూదన్ రెడ్డి

23-07-2025 01:15:51 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త మధుసూదన్ రెడ్డి మరణంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో జన్మించి.. అంచెలంచెలుగా ఎదిగి ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ, ఉస్మానియా యూ నివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా ప్రత్యేక గుర్తింపును పొందారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 1969 తొలి దశ ఉద్యమంతో పాటు ముమ్మరంగా సాగిన మలి దశ ఉద్యమంలో కూడా వారు చురుగ్గా పాల్గొన్నారని, ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో బాధ్యతలు చేపట్టి, వాటికి వన్నె తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రొఫెసర్‌గా ఆయన పాఠాలతో వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.