26-08-2025 12:23:49 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 25: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన నిరుపేద రైతులకు 1991లో సర్వే నెంబర్ 274, 275, 276, 277, 278, 281లలో 125 ఎకరాలలో 125 మంది సీలింగ్ సర్టిఫికెట్లు ఇచ్చారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి తీసుకొచ్చి.. ఈ భూమిలో ఆన్‌లైన్ చేయ్యలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకవడంతో సీపీఎం పార్టీ అబ్దు ల్లాపూర్‌మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ చేసి.. పట్టా పాసు బుక్కులు ఇవ్వాలని బాధి త రైతులు.. సీపీఎం పార్టీ నాయకులు అనాజ్‌పూర్ గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హాజర య్యారు. ధర్నాలో పాల్గొన్న రైతులకు మద్దతు తెలిపి.. ఆ భూమిని పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో సీపీఎం పార్టీ నాయకులు, రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాన్‌వెస్లీతో పాటు జిల్లాకు చెందిన నాయకులను, రైతులను అరెస్టు చేసి పహాడీ షరీ ఫ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. సాయంత్రం 4 గంటలకు వదిలిపెట్టారు.
అనంతరం జాన్‌వెస్లీ మా ట్లాడుతూ.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల, నాయకులపై విచక్షణరహితంగా దాడి చేసి ఆడ, మగ అనే తేడలేకుండా అరెస్టులు చేయడం దారుణమన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేమని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.
సీపీఎం నాయకులకు అరెస్టులు, జైలు గోడలు కొత్తేమీ కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, ఏర్పుల నర్సింహా, గుండె శివకుమార్, ముత్యాల బాల్‌రాజ్, మహేశ్, రాములు, రంగయ్య, రవి, ఏ మహేశ్, బాటని బాల్‌రాజ్, కట్ట సత్తయ్య, రైతులుతదితరులున్నారు.