calender_icon.png 30 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థామ్మాలాంటి సినిమాలు బాధ్యతగా ఉంటేనే సాధ్యం

30-09-2025 01:28:17 AM

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘థామ్మా’. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో పరేశ్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా టీమ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సమావేశంలో హీరో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.. “మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వస్తున్న తర్వాతి చాప్టర్ ‘థామ్మా’. బేతాళ్‌కి హెడ్ థామ్మా. రష్మికతో తొలిసారి కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. నేను ప్రతి సినిమాకూ ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూస్తుంటాను. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఫస్ట్ టైమ్ ఇంత యాక్షన్ చేశాను. ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది” అన్నారు.

రష్మిక మాట్లాడుతూ.. “మాడాక్ హారర్ కామెడీ ఫిలిమ్స్‌లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది. కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పర్ఫార్మెన్స్ అమేజింగ్‌గా ఉంటాయి. అలాంటి సినిమా చేస్తున్నప్పుడు కచ్చితంగా నటీనటులపై ఎంతో బాధ్యత ఉంటుంది. ప్రతి సినిమాకూ కొత్త క్యారెక్టర్ చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ సినిమాతోనూ ప్రేక్షకులను సర్ర్పైజ్ చేస్తానని భావిస్తున్నా” అని చెప్పింది.