calender_icon.png 14 November, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ సవరణ బిల్లులో జేపీసీ మెంబర్‌గా ఎంపీ అరుణమ్మ

14-11-2025 12:00:00 AM

నారాయణపేట టౌన్, నవంబర్ 13: భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డి కే.అరుణమ్మ నియమితులయ్యారు. మరోసారి పాలమూరు ఎంపీకి కేంద్రం కీలక బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ తీవ్రమైన నేరారోపణలుఎదుర్కొంటున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను 30 రోజుల నిర్బంధం ఉన్నచో ఆ పదవుల నుండి తొలగించే నిబంధనలను ఈ బిల్లులు ప్రతిపాదిస్తున్నది.

జమ్మూ  కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2025, యూనియన్ టెర్రిటరీస్ (సవరణ) బిల్లు 2025 వంటి మూడు కీలక బిల్లులను పరిశీలించనుంది. అంతకుముందు (వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు) 2024 పై జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యురాలిగా ఎన్నికైన ఆ బిల్ పాస్ అవడంలో కూడా జే.పిసి సభ్యురాలిగా అరుణమ్మ కీలక పాత్ర పోషించారు.జేపిసి  మెంబర్ గా పాలమూరు ఎంపి అరుణమ్మకు కేంద్రం ఇంతటి కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనను జెపిసి మెంబర్ గా నియమించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ కి ఎంపి.డికె అరుణ కృతజ్ఞతలు తెలిపారు.